calender_icon.png 24 September, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షేమంగా తీసుకెళ్లండి.. సంతోషంగా జీవించండి

23-09-2025 10:20:15 PM

- మీ కుటుంబాలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు

- మద్యం సేవించి ఎట్టి పరిస్థితిలో వాహనాలు నడపకూడదు 

- ఆటో యూనియన్ నాయకులతో ఎస్సై ఓబుల్ రెడ్డి

చిన్నచింతకుంట: ఆర్థిక పరిస్థితులు ఎల్లప్పుడూ మధ్యలో ఉంచుకొని క్రమశిక్షణతో ప్రయాణాలు కొనసాగించాలని, సంతోషంగా జీవించాలని ఎస్సై ఓబుల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆటో యూనియన్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రయాణికులు మిమ్మల్ని నమ్మి మీ ఆటలలో ప్రయాణించడం జరుగుతుందని వారి నమ్మకండి రెట్టింపు చేసేలా మీరు వాహనాలు నడపాలని సూచించారు.

మీరు ఎప్పుడు ఇంటికి వస్తారు అని మీ కుటుంబాల సభ్యులు ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారని ఎక్కడ ఎలాంటి తగాదాలకు పోకుండా ప్రశాంతమైన వాతావరణంలో జీవనం కొనసాగించేలా నమ్మకంతో ఆటోలను నడిపించి ముందుకు సాగాలన్నారు. నిజాయితీతో కూడిన ప్రయాణం కొనసాగించినప్పుడు మీరు ఉన్నత స్థాయికి చేరుకునేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలని ప్రతి విషయంలో పారదర్శకత ఉన్నప్పుడే ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని నిబంధనలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదని పేర్కొన్నారు.

నిబంధన పక్కన పెట్టి ఇష్టం సారక్క వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ ఎవరైనా వినియోగించినట్లు మరేదైనా సమాచారం తెలిసిన వెంటనే సమాచారం అందించాలని తెలిపారు. ఆరోగ్యంగా ఉంటేనే జీవితం సుఖమయంగా ఉంటుందని ప్రతి వ్యక్తికి ఆరోగ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు. అనంతరం ఆటో యూనియన్ నాయకులు ఎస్ఐ ఓబుల్ రెడ్డిని ప్రత్యేకంగా శాలువా పూలమాలతో సన్మానించారు. ఎస్సై చెప్పిన ప్రతి సూచనలను ఆదేశాలను పాటిస్తూ ముందుకు సాగుతామని వారు పేర్కొన్నారు.