calender_icon.png 24 September, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు ఆదేశాలతో మంథనిలో అక్రమంగా నిర్మించిన ఇల్లు కూల్చివేత

23-09-2025 10:24:13 PM

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని అక్రమంగా నిర్మించిన రెండు అంతస్తుల నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు మంగళవారం తొలగించారు. పోలీసుల బందోబస్తు మధ్య రెండు జేసీబీల సాయంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూల్చివేశారు. అక్రమంగా మంథని- పెద్దపల్లి ప్రధాన రహదారి పక్కన ఇల్లు నిర్మిస్తున్నారని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఫిర్యాదు దారుడు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో దాదాపు రెండేళ్ల తర్వాత కోర్టు తీర్పు రావడంతో మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాన్ని తొలగించారు.

టౌన్ ప్లానింగ్ అధికారులు మార్కింగ్ ఇచ్చిన ప్రకారం కూల్చి వేశారు. అదే విధంగా మంథని పట్టణంలో అక్రమ నిర్మాణలను కూల్చివేయాలని కోర్టులో ఇదివరకే పలు పిర్యాదులు కూడా దాఖలాయ్యయి. కోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే వాటిని కుల్చివేస్తామని మంథని మున్సిపల్ అధికారులు తెలిపారు. మంథని పట్టణంలో ఇప్పటికే గత కొంతకాలంగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన కట్టడాలను కూల్చివేయాలని గతంలో హైకోర్టులో స్థానికులు ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదుతో గత సంవత్సరం మంథని పట్టణంలో కొంతమంది ఇండ్లను మాత్రమే మున్సిపల్ అధికారులు పాక్షికంగా కూల్చివేసి చేతులు దులుపుకున్నారు. దీంతో వారు మళ్ళీ ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. దీంతో మున్సిపల్ అధికారులపై మంథని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అక్రమంగా ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు లేకుండానే శాశ్వత నిర్మాణాలు చేపట్టిన ఇళ్లను కూల్చివేయాలని మంథని పట్టణ ప్రజలు అధికారులను కోరుతున్నారు.