23-09-2025 10:16:42 PM
చిన్నకోడూరు: పట్టపగలే దొంగ హల్చల్ చేసిన సంఘటన చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కాపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి ఎల్లవ్వ తన వ్యవసాయ పొలం వద్దకు వెళుతుండగా గుర్తు తెలియని దొంగ ఎల్లవ్వ పై పడి చెవి కమ్మలు లాక్కున్నాడు. ఎల్లవ్వ కుడి చెవి కమ్మ లాగడంతో చెవి తెగిపోయింది. చుట్టుపక్కల రైతులు గమనించి దొంగను వెంబడించి పట్టుకున్నారు. పట్టుకున్న దొంగను గ్రామంలోని ఓ చెట్టుకు కట్టేసి చిన్నకోడూరు ఎస్సై సైఫ్ అలీకి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.