1 July, 2026 | 2:07 AM

జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలకు సిద్ధార్థ విద్యార్థిని

01-07-2026 01:12 AM

ముకరంపుర, జూన్ 30 (విజయక్రాంతి): ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 8 రోజుల పాటు సాగిన తెలంగాణ 12 వ తెలంగాణ రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలలో సిద్ధార్థ పాఠశాల విద్యార్థిని  రజత పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయింది. 1260 మంది షూటర్లు పాల్గొనగా సిద్ధార్థ విద్యార్థిని కె. హైద్రిక ఉత్తమ ప్రతిభ కనబర్చి రజత పతకము సాధించి, అక్టోబర్ నెలలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయినది. ఈ సందర్భంగా విద్యార్థినిని చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ దాసరి స్వప్న రెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.