1 July, 2026 | 2:06 AM

పక్కాగా భూహక్కుల కోసం రీ సర్వే

01-07-2026 01:11 AM

కలెక్టర్ ప్రతిమా సింగ్ 

శివంపేట్, జూన్ 30 : పక్కగా భూ హక్కుల రీ సర్వే నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శివంపేట్ మండలంలోని బీ క్యాతాండ లో ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భూభారతి భూముల రిసర్వే గ్రామసభ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ,ఆర్డీవో ఎడి సర్వే ఎంపీడీవో గ్రామ సర్పంచ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడు తూ..శివంపేట మండలం 1946 సంవత్సరంలో రిసర్వే అయిందని, అప్పటి నుంచి చాలా సమస్యలు ఉన్నాయన్నా రు. భూమి క్రయవిక్రయాల్లో మ్యాపులను కూడా అప్డేట్ చేయాలన్నారు. గ్రామాల్లో భూ నక్షల్లో సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 

భూ రీ సర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొంద పరుస్తామన్నారు. ఏలాంటి భూ వివాదాలు లేకుండా చేసి,భూమికి భూధార్ ను అందించడం జరుగుతుందన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశం అన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ... శాశ్వతంగా భూ సమస్యల పరిష్కారం కోసమే భూ రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ల్యాండ్ సర్వే అధికారి ఎ . కిషన్, నర్సాపూర్ ఆర్డీఓ శ్రీనివాసులు , ఎంపిడిఓ వెంకటలక్సమమ్మ, రెవిన్యూ సిబ్బంది, మండల బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పబ్బ రమేష్ గుప్తా, శివంపేట్ సర్పంచ్ రాజీపేట వెంకటేశ్వర్లు, తిమ్మాపూర్ సర్పంచ్, రాజు, తలపల్లి తండా లక్ష్మి గేమసింగ్,భిక్య తండా గ్రామ సర్పంచ్ నేనావత్ విజయ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.