18 August, 2026 | 8:00 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

కూరల నాణ్యతలో నిర్లక్ష్యం సహించం

01-07-2026 01:13 AM

కలెక్టర్ హైమావతి 

సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 30: మధ్యాహ్న భోజనంలో కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా అమలు చేసి, విద్యార్థులకు రుచికరంగా, కడుపునిండా భోజనం వడ్డించాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ప్రధానోపాధ్యాయులు, సిబ్బందిని  ఆదేశించారు. మంగళవారం చిన్నకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి భోజన నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, మెనూ అమలు, ఆహార నాణ్యతపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కూరల నాణ్యతలో నిర్లక్ష్యం సహించబోమని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఓపీ, హాజరు రిజిస్టర్లను పరిశీలించారు.