రేపు విద్యాసంస్థల బంద్
20-08-2026 10:56 PM
నిర్మల్,(విజయ క్రాంతి): రూపా రెడ్డి హత్యకు నిరసనగా ట్రస్మా రాష్ట్రవ్యాప్త బంద్ అందులో శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిరసన. బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రవేట్ స్కూల్ యాజమాన్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్ వెంకటేశ్వరరావును తెలిపారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఉపాధ్యాయులు నల్ల నిరసన తెలుపుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్మల్ జిల్లా కార్యదర్శి పడల ప్రభాకర్,నిర్మల్ పట్టణ అధ్యక్షులు అయ్యన్నగారి శ్రీధర్ చంద్ర గౌడ్ నిర్మల్ ప్రధాన కార్యదర్శి జి. శ్యామ్ ప్రకాశ్ పద్మనాభం గౌడ్ తదితరులు ఉన్నారు.






