గుంతల రహదారి పొంచి ఉన్న ప్రమాదము
పట్టించుకోని అధికారులు
మాగనూరు,(విజయక్రాంతి): మాగనూరు మండలంలోని బిటి రహదారులు గుంతలు గుంతలుగా ఏర్పడి ప్రమాదాలకు నిలయముగా మారుతుందని మoదిపల్లి గ్రామ సర్పంచ్ రాఘవరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ 167వ జాతీయ రహదారి వడ్వా టు గేటు నుంచి అడవి సత్యారం, కొల్పూరు, మందిపల్లి, గ్రామాలకు వెళ్లే బీటీ రహదారి ఇసుక టిప్పర్లు అధిక లోడుతో వెళ్లడం వల్ల రహదారులు పూర్తిగా ధ్వంసమై గుంతలు గుంతలుగా ఏర్పడుతుందన్నారు.
ఈ రహదారి సింగల్ రోడ్డు కావడంవల్ల ఎదురుగా ఎదురుగా పెద్ద వాహనాలు వస్తే పక్కకు సైడ్ తీసుకొనుటకు చాలా భయం వేస్తుందని వాహనదారులు అంటున్నారు. అడవి సత్యారం గ్రామం దగ్గర గల పెద్ద వాగు నుంచి ప్రతిరోజు రాత్రి, పగలు,ఇసుక టిప్పర్లు అధిక లోడుతో అతి వేగంగా వెళ్లడం వల్ల బిటి రహదారులు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని ఆయా గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. . ఈ రహదారి గుండా అత్యవసర వైద్యం కోసం ఇతర గ్రామాలకు వెళ్లాలన్న మధ్యలోనే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందన్నారు.
ప్రతిరోజు ఈ రహదారికి అనేక మలుపులు ఉండడం వల్ల వర్షాలు కురవడం వల్ల రహదారి పై ఎదురు ఎదురుగా పెద్ద వాహనాలు వస్తే ఈ రోడ్డు పై పక్కకు వాహనాలను తీసుకోవాలన్న చాలా ఇబ్బందిగా ఉందన్నారు.ద్విచక్ర వాహనాలు వెళ్లాలన్న, కాలినడకన వెళ్లాలన్న ఎదురుగా వచ్చే టిప్పర్ల స్పీడు నుంచి ఏ ప్రమాదం ఎప్పుడు జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నామన్నారు. రోడ్డుపై గుంతలు గుంతలుగా ఏర్పడడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయని ఆయా గ్రామస్తులు అంటున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు.






