21 August, 2026 | 12:03 AM

బిజెపి జిల్లా మహిళా మోర్చా కమిటీ నియామకం

20-08-2026 10:52 PM

అధ్యక్షురాలుగా సముద్రాల గాయత్రి

బిజెపి మహిళా కమిటీని ప్రకటించిన జిల్లా అధ్యక్షులు" బైరెడ్డి"

కొత్తగూడెం,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ అనుబంధ జిల్లా మహిళా మోర్చా నూతన కమిటీని పార్టీ అధ్యక్షులు,బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు.  కొత్తగూడెం జిల్లా కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా కమిటీకి పూర్తిస్థాయి 26 మంది సభ్యులతో, కూడిన కమిటీని నియమించడం జరిగింది. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా సముద్రాల గాయత్రిని నియమిస్తూ, పార్టీ అధ్యక్షులు అధికారికంగా ప్రకటించారు.  అధ్యక్షురాలు సముద్రాలు గాయత్రి ఆధ్వర్యంలో 26 మంది సభ్యులతో కూడిన జిల్లా కమిటీని ప్రకటించడం జరిగింది.

కమిటీలో ఉపాధ్యక్షులుగా కేతిని సావిత్రి, బానోత్ గంగ, అట్రం మమత, గరిక లక్ష్మి, ప్రధాన కార్యదర్శులుగా జల్ల స్వప్న, మువ్వ అపర్ణలను నియమించారు.  కార్యదర్శులుగా ధారావత్ పార్వతి, అడప వెంకట మణి, బట్టు సంధ్య, ఉయిక తులసిలను నియమించారు. కోశాధికారిగా భీమల్ సునీత, ఆఫీస్ సెక్రటరీలుగా భుఖ్య ఆశ, కొల్లె అనిత, సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా పల్లపు శిరీష, మంకీ బాత్ కన్వీనర్‌గా బండారి రాజేశ్వరి, ఐటీ కన్వీనర్‌గా పోలే మనస్విని, స్పోక్స్ పర్సన్‌గా భోగ లక్ష్మిలను ఎంపిక చేశారు.

అలాగే తాండ్ర కుసుమ భవాని, ఏసు మని, ధారావత్ భారతి, ధారావత్ విష్ణు ప్రియ, పుట్ట వెంకటరమణ, పర్సగాని నాగమణి, పర్సగాని శ్రావణి, రావుల పద్మ, పుట్టి సుజాతలను కార్యవర్గ సభ్యులుగా నియమించారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి మాట్లాడుతూ, మహిళా మోర్చా నూతన కమిటీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.  మహిళా శక్తిని మరింత బలోపేతం చేస్తూ, పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు ప్రత్యేకించి 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, వివక్షతకు వ్యతిరేకంగా బిజెపి మహిళ ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి పార్టీలో మహిళలకు కీలక బాధ్యతలు అప్పగించడం హర్షణీయమన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు.