మూత్రాశయ సమస్యలపై మౌనమా?
వయసు పెరిగేకొద్దీ మహిళల్లో కనిపించే మూత్రాశయ, పెల్విక్ ఫ్లోర్ సంబంధిత సమస్యలను మౌనంగా భరించకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించాల ని అపోలో ఆస్పత్రుల నిపుణులు సూచించా రు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రుల ప్రాంగణంలో శనివారం ‘ఏజింగ్ విత్ కాన్ఫిడెన్స్ సొల్యూషన్స్ ఫర్ బ్లాడర్ అండ్ పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లమ్స్‘ పేరుతో ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వృద్ధ మహిళలు, వారి కుటుంబ సభ్యులు, సంరక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మూత్రం అదుపులో లేకపోవడం (యూరినరీ ఇన్కాంటినెన్స్), పెల్విక్ అవయవాలు జారిపోవడం (పెల్విక్ ఆర్గన్ ప్రోలాప్స్), మూత్రాశయ ఆరోగ్యం, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, పెల్విక్ ఫ్లోర్ కండరాల బలోపేతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు అవగాహన కల్పించారు. పాల్గొన్న వారికి ఉచితంగా బోన్ మినరల్ డెన్సిటీ (బీఎండీ), రక్తపోటు, రక్తంలో చక్కెర పరీక్షలు నిర్వహించడంతో పాటు ఫిజియోథెరపీ ప్రదర్శనలు, సందేహ నివృత్తి కార్యక్రమాలు నిర్వహించారు.
యూరోగైనకాలజీ విభాగానికి చెందిన డా. నిర్మల పాపల్కర్, డా. శ్రీజ గుర్రాల, జీరియాట్రిక్ మెడిసిన్ నిపుణురాలు డా. ధర్షిత ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. న్యూరాలజీ, రుమటాలజీ, కార్డియాలజీ విభాగాల నిపుణులు కూడా పాల్గొని వృ ద్ధ మహిళల ఆరోగ్యానికి బహుళ విభాగాల సమన్వయ చికిత్స అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మహిళలు మూత్రం లీక్ కావడం, పెల్విక్ ఫ్లోర్ సమస్య లు, మూత్రాశయ ఇబ్బందుల గురించి తొలిసారిగా బహిరంగంగా తమ అనుభవాలను పంచుకోవడం విశేషం.
సిగ్గు, సామాజిక అపోహలు, అవగాహన లోపం కారణంగా చాలా మంది మహిళలు చికిత్స ఆలస్యం చేస్తున్నారని వైద్యులు తెలిపారు. అపోలో హాస్పిటల్స్ తెలుగు రాష్ట్రాల సీఈఓ తేజస్వి రావు వీరేపల్లి మాట్లాడుతూ.. మహిళల్లో ఇలాంటి సమస్యలపై ఉన్న మౌనాన్ని చెరిపివేయడం, అవగాహన పెంచడం, ప్రారంభ దశలోనే వైద్య సేవ లు అందుకునేలా ప్రోత్సహించడం కోసం అపోలో ఆస్పత్రులు నిరంతరం ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో, ఆరోగ్యంగా వృద్ధాప్యాన్ని గడపాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.






