calender_icon.png 10 May, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వంతో సింగరేణి కాలరీస్ అధికారుల అవగాహన ఒప్పందం

24-04-2025 12:05:37 AM

కలెక్టర్‌ని కలిసిన సింగరేణి అధికారులు 

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 23 (విజయక్రాంతి): మణుగూరు సింగరేణి అధికారులు బుధవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ ని ఐడిఓసీలో కలిశారు. మణుగూరు మండలం లో ఉన్న అన్నారం విలేజ్ నందు తిమారెడ్డి కుంట పూడిక తీత పనికి కలెక్టర్ ని కలిసి  ప్ర భుత్వంతో  రూ 70.83 లక్షలు కు గాను ఎం ఓ యు  చేసుకున్నారు. సింగరేణి కాలరీస్ వలన సంస్థ చుట్టుపక్కలలో ఉన్న గ్రామాలలో అందరికీ కూడా విద్య, వైద్య సహాయం  ఉద్యోగ సౌకర్యాలను కలిపిస్తూ చెరువులు, కుంటలు,వ్యవసాయం, మౌలిక వసతీలు తదితర అనేకమైనటువంటి సధుపాయాలు ప్రజలకు కలిపిస్తున్నందుకు సింగరేణి అధికారులను కలెక్టర్ అభినందించారు.