5 May, 2026 | 1:53 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

కోయగూడెం ఓ.సి.ని సందర్శించిన సింగరేణి డైరెక్టర్లు

13-03-2026 12:00 AM

టేకులపల్లి, మార్చి 12, (విజయక్రాంతి): సింగరేణి కార్పొరేట్ ఉన్నతాధికారులు డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ, జి.యం (సి.పి.పి) ఏ. మనోహర్, జి.యం (క్వాలిటీ) ఏ. రవి కుమార్ గురువారం ఇల్లందు ఏరియాలోని కోయగూడెం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్బంగా వారు కే.ఓ.సి. వ్యూ పాయింట్ నుంచి పని స్థలాలను సందర్శించి అక్కడ జరుగుచున్న పనులను పరిశీలించారు.

ప్రాజెక్టులో జరుగుతున్న రోజు వారి బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను, భద్రతా చర్యలు, యంత్రాల పనితీరు తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. పనులను నాణ్యతతో పాటు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ముందుకు తీసుకెళ్లాలని జి.యం వి.కృష్ణయ్యకి తెలిపారు. బొగ్గు నాణ్యత సామర్థ్యం పెంచే జి.13 బొగ్గు ఉత్పతి ఐయే లాగా చూడాలని అలాగే ఉపరితల గనుల్లో ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలు, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి తీయాలని తెలిపారు. డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ మాట్లాడుతూ..

బొగ్గు ఉత్పత్తి, రవాణా రోజు వారి లక్ష్యాలను అధికమించాలని, బొగ్గు ఉత్పత్తి, రవాణాకు ఎటువంటి ఆటంకములు కలుగకుండా ముందస్తు జాగ్రతలు తీసుకోవాలని, ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా రక్షణతో కూడిన ఉత్పత్తి తీయాలని, సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాలను అధిగమి౦చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ప్రాజెక్ట్ అధికారి గోవిందరావు, కే.ఓ.సి మేనేజర్ శ్రీనివాస రావు, క్వాలిటీ మేనేజర్ రామదాస్, సెక్యూరిటీ అధికారి అంజిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.