calender_icon.png 13 May, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనరల్ అసిస్టెంట్‌గా సింగరేణి జనరల్ మజ్దూర్లు

24-04-2025 01:43:45 AM

కార్మికుల హోదా మార్పుపై ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): సింగరేణి సంస్థలో క్యాటగిరీ  పనిచేస్తున్న జనరల్ మజ్దూర్లను ఇకపై జనరల్ అసిస్టెంట్‌గా మారుస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సింగరేణిలోని 14 వేల మంది జనరల్ మజ్దూర్లతోపా టు కార్మికులు, కార్మిక సంఘాల నా యకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కేవలం నిరక్షరాస్యులు మాత్ర మే జనరల్ మజ్దూర్లుగా పనిచేస్తుండేవారు. ప్రస్తుతం కారుణ్య నియామ కాల్లో ఉన్నత చదువులు చదివినవారు కూడా తొలుత బదిలీ వర్కర్లుగా పనిచేసి ఏడాది తర్వాత జనరల్ మజ్దూర్లు గా గుర్తింపుపొందుతారు.ఈ మార్పు ను వెంటనే అమలు చేసిన సంస్థ సీఎండీ బలరామ్‌కు కార్మికులు, కార్మిక సంఘాలు కృతజ్ఞతలు తెలియజేశాయి.