24-04-2025 01:45:04 AM
మద్నూర్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఈ నెల 27న వరంగల్ లో నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బన్సీ పటేల్ ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో వరంగల్ బహిరంగ సభా పోస్టర్ ను నాయకులతో కలసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకే తెలంగాణ సాధన, అభివృద్ధే ధ్యేయంగా బీఆర్‌ఎస్ పార్టీ పనిచేసిందని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు గత పదేళ్ల బీఆర్‌ఎస్, కేసీఆర్ పాలనలో జరిగాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువనాయకులు వాగుమరే మారుతీ బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.