సింగరేణి టీచర్లకు 12 నెలల వేతనాలు చెల్లించాలి
24-04-2026 12:21 AM
ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలోని సింగరేణి పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకు 12 నెల వేతనాలు అందించాలని సింగరేణి సీఎండీ డా.బుద్ధప్రకాష్ జ్యోతిని టీచర్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి కోరారు. ఈమేరకు గురువారం ఆయన్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. అతితక్కువ వేతనాలతో పనిచేస్తున్న సీఆర్టీలు కేవలం పది నెలల వేతనాలు మాత్రమే పొందుతూ ఇబ్బందులు పడుతున్నారని, సింగరేణి ఆస్పత్రుల్లో వారికి ఉచిత వైద్యం అందించాలని కోరుతూ ఆయన దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు. దీనిపై సీఎండీ సానుకూలంగా స్పందిస్తూ తిరిగి వారిని విధుల్లో చేరే విధంగా ఉత్తర్వులు ఇస్తామని చెప్పినట్లు శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు.






