2 June, 2026 | 2:43 AM

గాయని సుమన్ కల్యాణ్‌పూర్ కన్నుమూత

02-06-2026 12:00 AM
  1. కొద్దిరోజులుగా వృద్ధాప్య సమస్యలతో సతమతం
  2. ముంబైలోని స్వగృహంలో తుదిశ్వాస
  3. గాయనిగా సుమన్‌ది ఆరు దశాబ్దాల ప్రయాణం
  4. హిందీ, మరాఠీ, గుజరాతీ, ఒడియాలో వేలాది పాటలు

ముంబై, జూన్ ౧: ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కల్యాణ్‌పూర్ (89) కన్నుమూశారు. కొద్దిరోజుల నుంచి వృద్ధాప్య సమస్యలతో సతమతమవుతున్న ఆమె ఆదివారం రాత్రి ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్దాల పాటు ఆమె బాలీవుడ్ నేపథ్య గాయనిగా కొనసాగారు. చివరి రోజుల్లో తన సొంత పాటలనే వింటూ సమయం గడిపారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సుమన్ కల్యాణ్‌పూర్ 1937 జనవరి 2న అవిభక్త భారత్‌లోని ఢాకాలో జన్మించారు.

ఆమె అసలు పేరు సు మన్ హేమాడి. తండ్రి శంకర్‌రావు హేమాడి కర్ణాటకలోని మంగళూరుకు చెందినవారు. శంకర్‌రావు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నతాధికారిగా పని చేసేవారు. ఆ ఉద్యోగ రీత్యా వారి కుటుంబం ఢాకాలో ఉండాల్సివచ్చింది. తర్వాత 1943లో కొన్నికారణాల వల్ల వారి కుటుంబం ముంబైకి వచ్చింది. సుమన్‌కు చిన్నతనం నుంచి కళల పట్ల మక్కువ ఉండేది. ఇంట్లో ఎప్పుడూ సంగీత వాతావరణం ఉండేది.

శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తితో సుమన్ సాధన ప్రారంభించారు. 1958లో ముంబైకి చెం దిన వ్యాపారవేత్త రామానంద్ కల్యాణ్‌పూర్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. ఆ తర్వా త ఆమె పేరు సుమన్ కల్యాణ్‌పూర్‌గా మా రింది. సినిమాల్లో పాడటానికి ఆమెకు తొలి అవకాశం ఆకాశవాణి ద్వారా వచ్చింది.

రేడియోలో ఆమె పాడిన పాటలను విని కొందరు సంగీత దర్శకులు అవకాశమిచ్చారు. 1952లో ‘షుక్రచి చాందినీ’ అనే మరాఠీ సినిమాతో గాయనిగా తన ప్రస్థానాన్ని ప్రారం భించారు. హిందీలో 1954లో వచ్చిన ‘దర్వాజా’ సినిమాతో బాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేశారు. ఆ సినిమాలో తలత్ మహమూద్‌తో కలిసి పాడిన యుగళ గీతం ఆమెకు మంచి పేరు తెచ్చింది.

ఎన్నో అవరోధాలు.. అడ్డంకులు

సినీ పరిశ్రమలో స్థిరపడే క్రమంలో సుమన్ ఎన్నో అడ్డంకులు, అవరోధాలను ఎదుర్కొన్నారు. ఆ కాలంలో లతా మంగేష్కర్, ఆశా భోస్లే వంటి దిగ్గజ గాయనీ మణుల హవా నడిచేది. సుమన్ స్వరం లతా మంగేష్కర్ గొంతును పోలి ఉండేది. దీంతో సంగీత దర్శకులు ఆమెను లతా మం గేష్కర్‌కు ప్రత్యామ్నాయంగానే చూశారు. కొన్నిసార్లు లతా మంగేష్కర్ అందుబాటులో లేనప్పుడు ఆ పాటలు సుమన్ పాడా ల్సిన పరిస్థితి.

ఈ పోలిక ఆమెకు కొన్ని అవకాశాలను తెచ్చినప్పటికీ సొంత గుర్తింపు కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చింది. రాయ ల్టీ వివాదం కారణంగా లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ మధ్య ఆ రోజుల్లో మాటలు ఆగిపోయాయి. దీంతో రఫీతో కలిసి పాడేందుకు నాటి మహిళా గాయనీమణులు వెను కాడారు. అప్పుడు సుమన్ ధైర్యంగా తాను పాడతానని ముందుకొచ్చారు. రఫీతో కలిసి ఆమె ఎన్నో అద్భుతమైన యుగళ గీతాలు పాడారు. 1950 మధ్య ఆమె పాటలు అమిత ప్రజాదరణ పొందాయి.

హిందీ, మరాఠీ, బెం గాలీ, గుజరాతీ, ఒడియా, పంజాబీ భాషల్లో వేలాది పాటలు పాడారు. ఆమె పాడిన భక్తి గీతాలు, లలిత సంగీతం శ్రోతలను అలరించాయి. ‘ఆజ్కల్ తేరే మేరే ప్యార్ కే చర్చె’, ‘నా నా కర్తే ప్యార్ తుమ్హీ సే’, ‘తుమ్నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే’ వంటి పాటలు ప్రజాదరణ పొందాయి.

సుమన్ తన ఆత్మకథను ‘సుమన్ సుగంధ్’ పేరుతో రాశారు. భారత ప్రభుత్వం ఆమెను 2023లో పద్మభూషణ్ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఆమె మృతి పట్ల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ చిత్రరంగం ఒక దైవిక స్వరాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు.