31 May, 2026 | 2:57 AM

సింగిల్ విండో చైర్మన్‌లను కొనసాగించాలి

31-05-2026 01:43 AM

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు మండలి ప్రతిపక్ష నేత విజ్ఞప్తి

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి) : సింగిల్ విండో చైర్మన్‌లను కొనసాగించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ నేతలు, సహకార సంఘాల చైర్మన్లతో కలిసి శనివారం లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు వినతి పత్రం అందించారు. అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ ప్రభుత్వం కుట్ర పూరితంగా సహకార సంఘాల్లో నామినేటెడ్ వ్యక్తులను నియమించాలని చూస్తోం దని, ఇది సహకార సంఘాల చట్టానికి విరుద్ధమని తెలిపారు.

న్నికలు జరపకుండా వారికి అనుకూలంగా ఉన్న వారిని నామినేట్ చేయాలని చూస్తోందన్నారు. ఈ అంశంపై గవర్నర్ కు వినతిపత్రం అందజేశామని, రాష్ట్ర ప్రభు త్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరినట్టు వివరిం చారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న లీగల్ ఓపీనియన్ తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తామని గవర్నర్ హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని, సహకార సంఘాల ఎన్నికలు జరపకుండా కుట్రపూరితంగా నామినేటెడ్ వ్యక్తులను నియమించడం చట్ట విరుద్ధమని మండిపడ్డారు.