31 May, 2026 | 2:19 AM

ఎడ్‌సెట్‌లో 28,446 మంది అర్హత

31-05-2026 01:41 AM

ఫలితాలు విడుదల చేసిన విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యా యి. ఎడ్‌సెట్‌లో మొత్తం 28,446 మంది అర్హ త సాధించారు. శనివారం మాసాబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్లు పురుషోత్తం, మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్, కాకతీయ వర్సిటీ వీసీ ప్రతాప్ రెడ్డి, ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి.వెంకట్రామ్ రెడ్డి కలిసి ఫలితాలను విడుదల చేశారు.

మొత్తం 35,600 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్ష రాసిన 29,342 మందిలో అర్హత సాధించింది 28, 446 (96.95 శాతం) మంది. తొలిర్యాంకును భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన బానోతు అజిత్ సాయి కృష్ణ, రెండో ర్యాంకును సూర్యాపేటకు చెందిన పోతుగంటి తరుణ్ కుమార్ సాధించారు. గతేడాది మొత్తం 196 కాలేజీల్లో 17,350 సీట్లకు గానూ 13,278 కన్వీనర్ సీట్లు ఉన్నాయని, అందులో 7,469 భర్తీ అయ్యాయని అధికారులు తెలిపారు. కళాశాలల అఫిలియేషన్ ముగిసిన తర్వాత కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొన్నారు.