22 March, 2026 | 12:38 AM

సెమీస్‌కు సిన్నర్

15-11-2024 12:00 AM

ఏటీపీ ఫైనల్స్

టురిన్ (ఇటలీ): ఏటీపీ టూర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సిన్నర్ సెమీస్ బెర్తు దాదాపు ఖరారు చేసుకున్నాడు. గురువారం పురుషుల సింగిల్స్‌లో అలెక్స్ డి మినార్‌పై టేలర్ ఫ్రిట్జ్ విజయం సాధించడంతో మెద్వెదెవ్‌తో మ్యాచ్‌కు ముందే సిన్నర్‌కు లైన్ క్లియర్ అయింది. అమెరికా స్టార్ టేలర్ ఫ్రిట్జ్ 5-7, 6-4, 6 -3,  మినార్‌పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో జ్వెరెవ్ 7-6 (7/3), 6-3, కాస్పర్ రూడ్‌పై విజయాన్ని నమోదు చేసుకున్నాడు.