calender_icon.png 5 July, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యా.. కలెక్టర్ సారూ.. నా సమస్య తీర్చండి

05-07-2025 12:00:00 AM

భద్రాద్రి కొత్తగూడెం జులై 4 (విజయ క్రాంతి): అధికారులకు రెండు సంవత్సరాలుగా మొరపెట్టుకున్న సమస్య పరిష్కారం కాకపోవడంతో 82 సంవత్సరాల వృద్ధురాలు పిండిప్రోలు సీతాలక్ష్మి శుక్రవారం కలెక్టర్ కార్యాలయం మెట్లు ఎక్కింది. కొత్తగూ డెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్‌లో స్వాతీ స్కూల్ ఏరియాలో తన ఇంటి పక్కన మున్సిపల్ డ్రైనేజీ ఆక్రమించి కటిక దుకాణం షెడ్డు నిర్మించారు.

ఆ షెడ్డులో మేకలు గొర్రెలను పెంచుతూ, అక్క డే వాటిని కోసి వ్యర్ధాలను మురుగు కాలువలో పడేస్తున్నారు. ఈ సమస్యతో దుర్గంధం వెదజల్లి అనారోగ్య పరిస్థితి నెలకొంది. ఆ పరిసర ప్రాంతాల ప్రజలు అనేకసార్లు మున్సిపల్ అధికారులకు మొర పెట్టుకున్న ఫలితం లేకుండా పో యింది.

తన ఇంట్లో కిరాయికి ఉన్న వాళ్లు, అంగన్వాడీ కేంద్రం సైతం ఆదుర్గందాన్ని తట్టుకోలేక కాళీ చేశారు. ఒకవైపు దుర్గంధం, మరోవైపు ఆర్థిక భారం తనను బాధిస్తుంది. తమరైన కల్పించుకొని సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నాను. అంటూ ఫిర్యాదు చేశారు.