11 May, 2026 | 1:50 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

ములుగు జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

04-07-2025 11:02 PM

జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్

ములుగు,(విజయక్రాంతి): ములుగు జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల రోజుల (జూలై 4వ తేది నుండి 31 వరకు)పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు,రాస్తా రోకోలు,నిరసనలు,ర్యాలిలు,పబ్లిక్ మీటింగ్ లు,సభలు,సమావేశాలు నిర్వహించరాదన్నారు. బందుల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పి సూచించారు. కావున శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు