04-07-2025 11:05:43 PM
ములుగు,(విజయక్రాంతి): ములుగు జిల్లా జూనియర్స్(అండర్-18 బాల బాలికల) బాస్కెట్ బాల్ జట్టు ఎంపికలు ములుగు బండారుపల్లి రోడ్ సన్ రైజర్స్ హై స్కూల్ లో నిర్వ హించబడ్డాయి అందులో నుండి ప్రతిభావంతులు అయిన క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగినది ములుగు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 30మందికి పైగా హాజరు అయినారు ఈ పోటీలలో ఎంపిక అయిన బాల-బాలికల టీంలు జులై 11నుంచి 13వరకు ఉత్తనూర్, గద్వాల్ లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో ములుగు జిల్లా నుండి ప్రతినిత్యం వహిస్తారని జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు శివకృష్ణ, కార్యదర్శి దుర్గయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథులుగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కుంజ సూర్య మరియు సన్ రైజర్స్ హై స్కూల్ కరస్పాండెంట్ వట్టెం రాజు క్రీడాకారులను అభినందించారు ఈ కార్యక్రమంలో పీఇటీలు ఎస్.శ్రీకాంత్,మహిపాల్,కోచ్ అంబాల వంశి పాల్గొన్నారు.ఈ క్రింద ఎంపిక అయిన క్రీడాకారుల పేర్లు తెలుపడం జరిగినది అవినాష్ లోహింద్ర ప్రణీత్ గౌతమ్ రిషిత్ నితిన్ హర్షవర్ధన్,వంశిక్రిష్ణ సాయితేజ,వరుణ్ భగవత్ రిషిక్ స్టాండ్ బాయ్స్ హర్షిత్,సాత్విక్,అఖిల్ ఎంపికయ్యారు.