దేమికలాన్‌లో 100 శాతం ఎస్‌ఐఆర్ పూర్తి..
21-07-2026 12:07 AM
తాడ్వాయి,జూలై, 20( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ లో 100 శాతం ఎస్ ఐ ఆర్ పూర్తి అయిందని సర్పంచ్ భైరవి రాజిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామపంచా యతీలో సోమవారం సర్పంచ్ మాట్లాడుతూ.. 100 శాతం ఎస్ ఐ ఆర్ త్వరగా పూర్తికావడానికి సహకరించిన బిఎల్‌ఓ లు అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిపిఓ నాగభూషణ్, బి ఎల్ ఓ లు శ్రీనివాస్, చందు తదితరులు పాల్గొన్నారు.






