28 May, 2026 | 1:56 AM

తెలుగు రాష్ట్రాల్లో ‘సర్’ దుమారం!

28-05-2026 12:00 AM

ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా సమగ్ర పునఃసమీక్ష ప్రక్రియ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయ భూమికను మార్చివేసే అవకాశం ఉందా? అన్న చర్చ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతోంది. మూడేళ్ల తర్వా త తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటరు జాబితా ప్రక్షాళ న, పారదర్శకత అనే లక్ష్యాలతో ముందుకువచ్చిన ఈ కార్యక్రమం రాజకీయ పక్షాల మ ధ్య వివాదాలకు కేంద్రబిందువుగా మారిం ది.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎన్నికల సంఘం చేపట్టే భారీస్థాయి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం. ఇందులో బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ధ్రువీకరిస్తారు. 2002 ఓటర్ల జాబి తా ఆధారంగా కుటుంబ సంబంధాలను లింక్ చేసి, డూప్లికేట్, బోగస్, చనిపోయిన, మారిన చిరునామాల ఓటర్లను తొలగిస్తా రు. తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్వోలు ఇంటింటి సర్వే చేస్తారు. ఏపీలో జూన్ 5 నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది.

డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ జూలై/ఆగస్టులో వెలువడి, ఫైనల్ రోల్ సెప్టెంబర్‌లో సిద్ధమవుతుంది. పశ్చిమ బం గాల్‌లో ఈ ప్రక్రియ తీవ్ర వివాదాలకు దారితీసిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే స్థాయి చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో పెద్ద మొత్తంలో బోగస్, డూప్లికేట్ ఓట్లు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. సర్ ద్వారా ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సర్‌ను వ్యతిరేకిస్తుండగా, ఏపీలోని కూటమి ప్రభుత్వం దీన్ని స్వాగతిస్తుండటం ఆసక్తిక రం. అదే సమయంలో రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు దీనిని ‘ఓటర్ల తొలగింపు’గా చూస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ మైనారిటీ, పేద, గ్రామీణ ఓట ర్ల జాబితాలో మార్పులు ఎక్కువగా ఉండవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో సుమారు 3.5 కోట్ల ఓటర్లు, ఏపీలో 4.16 కోట్ల ఓటర్లు ఉన్నారు. సర్ ద్వారా లక్షలాది బోగస్ ఓట్లు తొలగితే, ఎవరికి లాభం చేకూరుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిం ది. సాధారణంగా అధికార పక్షాలు బోగస్ ఓట్లను ఉపయోగించుకుంటాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. కానీ, ఈసారి సమీ కరణాలు మారే అవకాశం ఉంది. యువత, మహిళలు, వలస కార్మికుల ఓట్లు తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రతిప క్షాలపై ఉన్నది.

హైదరాబాద్‌లో ముస్లింలు, దళిత బస్తీల్లోని ఓటర్లు ఎక్కువగా ప్రభావితమవుతారని ఆందోళనలు వ్యక్తమవుతున్నా యి. ఎన్నికల సంఘం మాత్రం పారదర్శకంగా ప్రక్రియ ఉంటుందని చెప్తున్నది. ఓటర్లు 2002 జాబితాలో తమ పేర్లు చెక్ చేసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ వంటి పత్రాలు సిద్ధం చేసుకోవడం అత్యవసరం. ఆన్‌లైన్ వెరిఫికేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండటం ఊరట కలిగిస్తున్నది.

ఏపీ విషయానికి వస్తే, తమ పార్టీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని వైఎస్‌ఆర్సీపీ ఆందో ళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువ ఉండవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. వలస కార్మికులు, వ్యవసాయ కూ లీలు ఓటుహక్కు కోల్పోకుండా జాగ్రత్త వ హించాలని ఆ పార్టీ యోచిస్తున్నది. 

సర్ ద్వారా ఓటర్ల జాబితా ప్రక్షాళన జరుగుతుంది. ఒక్క ఓటు కూడా దుర్వినియోగం కాకుండా చూడవచ్చు. ఇది ప్రజాస్వామ్యా న్ని బలోపేతం చేస్తుంది. గతంలో జరిగిన సాధారణ రివిజన్ల కంటే ఇది మరింత ఇంటెన్సివ్‌గా ఉండటం విశేషం. డిజిటల్ టూల్స్, జియో ట్యాగింగ్ వంటి సాంకేతికత సహాయంతో మరింత కచ్చితత్వం సాధ్యమ వు తుంది. అయితే అమలులో అసమర్థత, పక్షపాతం ఉంటే వివాదాలు తప్పవు. మైనారి టీలు, పేదలు, మహిళలు, యువత ఓటుహక్కును కాపాడాలి. రాజకీయ పక్షాలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలి. ప్రజలు తమ గుర్తింపు పత్రాలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ ప్రక్రియలో పారదర్శకత కోసం సివి ల్ సొసైటీ సంస్థలు ఇందులో పాల్గొనాలి. ఓటర్లు తమ పేరు తొలగింపు గురించి అనుమానం ఉంటే వెంటనే అప్పీల్ చేయాలి. రాజకీయ పక్షాలు ప్రజాస్వామ్య బలోపేతం కోసం సహకరించాలి. సర్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలను మారుస్తుందా అనేది ఈ ప్రక్రియ అమలుపై ఆధారపడి ఉంటుంది. ఇది నిష్పక్షపాతంగా జరిగితే, స్వచ్ఛమైన ఎన్నికలకు మార్గం సుగమం అవుతుంది. లేకపోతే రాజకీయ వివాదాలు మరింత తీవ్రమవుతాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం బాధ్యతాయుతం గా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది.