పారదర్శకమైన ఓటరు జాబితా కోసమే ఎస్.ఐ.ఆర్
కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్, మార్చి 24 (విజయ క్రాంతి): ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ ఐ ఆర్)ను ఎన్నికల సంఘం చేపట్టిందని, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇందుకు పూర్తిగా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చిత్రా మిశ్రా అ న్నారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్.ఐ.ఆర్ కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులతో పాటు రాజకీయ పార్టీలు నియమించుకునే బి.ఎల్.ఎల పాత్ర కూడా కీలకమని అన్నారు. 1951 నుండి ఇ ప్పటివరకు 8 సార్లు ఎస్‌ఐఆర్ జరిగిందని చివరగా 2002 నుండి 2004 వరకు నిర్వహించార ని తెలిపారు. ప్రత్యేక సమరణ ద్వారా జాబితాలో నిజమైన ఓటరు కచ్చితంగా ఉంటారని తెలిపారు.
డూబ్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిపోయిన, రెండు ఓట్లు ఉ న్నవాళ్ల ఓట్లు మాత్రమే తొలగిస్తారని తెలిపారు. ఎవరూ అపోహకు గురి కావద్దని సూచించారు. రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను తప్పక నియమించుకోవాలని సూచించారు.
ప్రత్యేక సమగ్ర సవరణ తరువాత ఓటు హక్కు రానివారు ఉంటే ఆక్షేపణ చేయవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డిఓ రమేష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.రమణారెడ్డి, అబ్దుల్లా అసీం, సయ్యద్ బర్కత్ అలీ, సయ్యద్, సాతినేని శ్రీనివాస్, ఈ.రవీందర్, నాంపల్లి శ్రీనివాస్, ఎం వాసుదేవరెడ్డి, రామిడి తిరుపతిరెడ్డి, వి నర్సింగం పాల్గొన్నారు.




