బీఎల్‌ఏల సహకారంతో సర్ ప్రక్రియ పూర్తి
నిర్మల్ జులై30 (విజయక్రాంతి): ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ బి ఎల్ ఎ ల సమక్షంలో సమగ్ర ఓటర్ల సార్ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్టు ఉర్దూ అకాడమీ రాష్ట్ర తాహెర్ బిన్ అహ్మద్, పార్లమెంట్ ఇంచార్జ్ మోహన్ తెలిపారు. నిర్మల్ నియోజకవర్గం సరిపక్రియ బి ఎల్ ఏ గా పనితీరుపై గురువారం సమీక్ష నిర్వహించారు.
అన్ని పోలింగ్ బూతులు కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేస్తారని తెలిపారు. అరులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని అలాగే అర్హత లేని ఓటర్లను తొలగించాలని పిలుపునిచ్చారు. ఓటర్ల ప్రక్రియ తుది జాబితా ప్రకటించే వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరి రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ ఆది, సోమ భీమారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎంబరి రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






