రోడ్లపై నిలిచిన మురుగునీరు.. ఇబ్బందులు పడుతున్న జనం
31-07-2026 01:05 AM
కూసుమంచి, జూన్30,(విజయక్రాంతి) కూసుమంచి మండలం సంద్య తండా గ్రామ పంచాయతీ శివారు లో రహదారి పై వర్షపు మురుగు నీరు నిలిచిపోతున్నాయి. దీంతో గైగోళ్ళపల్లి నుంచి పక్కన ఉన్న తండాలకు ఈ రహదారి మీద ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చినుకు వర్షం కురిచిన మురుగునీరు అంతే ఉంటుంది. మురుగునీటిని తొలిగించే వా రు లేరని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్థానిక అధికారులు స్పం దించి మురుగునీటిని తొలగించాలని ప్రజ లు కోరుతున్నారు.






