6 July, 2026 | 3:10 AM

సిద్దిపేట జిల్లాకు ‘సిరో ఫార్మా’

06-07-2026 02:35 AM
  1. కరకపట్ల బయోటెక్ పార్క్‌లో క్యాన్సర్ ఔషధాల ప్లాంటు
  2. నేడు ప్రారంభించనున్న మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): భారతదేశపు ఫార్మా క్యాపిటల్‌గా అగ్రస్థానంలో వెలుగులీనుతున్న తెలంగాణా రాష్ట్రం మరో భారీ ఔషధ పరిశ్రమకు వేదిక కానుంది. క్యాన్సర్ ఔషధాలు ఉత్పత్తి చేసే సిరో ఫార్మా సిద్దిపేట జిల్లా కరకపట్లలోని బయోటెక్ పార్క్-3లో నిర్మించిన అత్యాధునిక ఉత్పత్తి కర్మాగారం సోమవారం ప్రారంభమవుతుంది.

ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సిరోప్లాంటును ప్రారంభిస్తారు. ఈ భారీ ప్లాం టులో పలు గ్లోబల్ ఔపధ ప్రమాణాల సంస్థల కొలమానాల ప్రకారం మందులు, సాఫ్ట్ జెల్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదరరాజనర్సింహ, పొంగులే టి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొంటారు. ప్లాంటులో ప్రస్తుతం 275 మంది సిబ్బంది పనిచేస్తుండగా పూర్తిస్థాయిలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఉద్యోగులు, సైంటిస్టుల సంఖ్య రెట్టింపు అవుతుంది.