23-02-2026 02:05:53 AM
ఇద్దరికీ వివాహం ఒకేరోజు పెళ్లికి కొన్ని గంటల ముందే ఇద్దరూ మృతి
జైపూర్, ఫిబ్రవరి22: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో గుండెల్ని పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఒకే పందిరిలో పెళ్లి జరగాల్సిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు వివాహానికి కొన్నిగంటల ముందే ప్రాణాలు తీసుకు న్నారు. మానాయ్ గ్రామానికి చెందిన శోభ(25), విమల(23) శనివారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్ద రూ ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
ఇద్దరికీ ఒకే రోజు పెళ్లి కావడంతో శుక్రవారం రాత్రి ఇంట్లో వేడుకలు ఘనంగా జరిగాయి. అర్ధరాత్రి వరకు బంధుమిత్రులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న అక్కాచెల్లెళ్లు ఆ తర్వాత నిద్రకు వెళ్లారు. తెల్లవారుజామున ౪ గంటల సమయంలో వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. సమాచారం అం దుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమా ర్టానికి తరలించారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.