23-02-2026 02:00:29 AM
ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృతి?
శిథిలాల కింద చిక్కుకున్న 23 మంది
పొరుగు దేశాల మధ్య మరింత పెరిగిన ఉద్రిక్తతలు
ఆఫ్గనిస్తాన్‌లోని నంగర్హర్, పక్తీకా ప్రాంతాల్లో దాడులు
కాబూల్, ఫిబ్రవరి22: పాకిస్థాన్ సైన్యం సరిహద్దు వెంబడి మెరుపు దాడులు చేసిం ది. ఆఫ్గనిస్తాన్‌లోని నంగర్హర్, పక్తీకా ప్రాంతా ల్లో ఈ దాడులు జరిగాయి. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా బాంబులు కురిపించినట్లు పాక్ ప్రకటించింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా డజన్ల కొద్దీ పౌరులు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
బెహ్‌సూద్ జిల్లాలో ఒక పౌరుడి ఇంటి పై బాంబులు పడ్డాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న 23 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఇప్పటివరకు కేవలం నలుగురిని మాత్రమే రక్షక సిబ్బంది బయటకు తీశారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నా యి. తమ దేశ భద్రతా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడాని కే పాక్ ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ఆఫ్గన్ మండిపడింది.
దాడులను ధ్రువీకరీంచిన పాకిస్థాన్
మరోవైపు పాకిస్థాన్ ఈ దాడులను ధ్రువీకరించింది. తమ దేశంలో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడులకు ప్రతికారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. పంజా బ్ తాలిబన్, ఐసిస్ అనుబంధ సంస్థల స్థావరాలను ధ్వంసం చేసినట్లు పాక్ సమాచార శాఖ వెల్లడించింది. ఏడు ఉగ్రవాద శిబిరాలను కచ్చితత్వంతో లక్ష్యం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ తాజా దాడులతో రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.