3 June, 2026 | 7:18 PM

సీతా రామాంజనేయ స్వామి దేవాలయం... నూతన కమిటీ ఎన్నిక

03-06-2026 06:13 PM

ఆలయ కమిటీ అధ్యక్షునిగా నవీన్ కుమార్ ఎన్నిక

జవహర్ నగర్,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ బాలాజీ నగర్ మార్కెట్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ నూతన కమిటీని ఆలయ సభ్యులు బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బాలాజీ నగర్ లోని పేరు ప్రఖ్యాతలుగాంచిన ప్రముఖ ఆలయమైన శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో దేవాలయ అభివృద్ధి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. అనంతరం నూతన ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జమాల్ పూర్ నవీన్ కుమార్ ను ఆలయ కమిటీ అధ్యక్షునిగా దేశపతి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన ఆలయ కమిటీ సభ్యులకు రుణపడి ఉన్నానని తెలిపారు. దేవుని సేవలో మరింత జాగరుత తో వ్యవహరిస్తానని తెలిపారు.