ముఖ్యమంత్రికి చెంపదెబ్బ
బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): హైడ్రా కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చెంపదెబ్బ అని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. తెలంగాణ భవన్‌లో సో మవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే జీవో -99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసి పేదల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించా రు. హైడ్రా కమిషనర్‌ఫై 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉండటం ప్రభుత్వ తీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. లోతుకుంట, బహదూ ర్గూడ, అమీన్పూర్ తదితర ప్రాంతాల్లో హైడ్రా పేరుతో జరిగిన కూల్చివేతలు, ప్రజ లు ఎదుర్కొన్న ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని అన్నారు.






