‘సీతారామ’ పనులు పూర్తిచేయాలి
16-05-2024 02:25 AM
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
ఖమ్మం, మే 15 (విజయక్రాంతి): ఏన్కూరు మండలంలో కొనసాగుతున్న సీతారామ ప్రాజెక్టు కాల్వ పనులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు బుధ వారం పరిశీలించారు. పనులను త్వరగా పూ ర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.




