28 March, 2026 | 11:05 PM

లోక్ అదాలత్‌లో 740 కేసులు పరిష్కారం

28-03-2026 09:29 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 740 కేసులు పరిష్కారం అయ్యాయి. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ లోక్ అదాలత్‌లో పలు సివిల్, క్రిమినల్ కేసులు పరస్పర రాజీతో పరిష్కారం అయ్యాయి. ఈ సందర్భంగా బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు న్యాయ మూర్తి ముకేష్ మాట్లాడారు. రాజీ మార్గమే రాచ మార్గమని అన్నారు. లోక్ అదాలత్ లో న్యాయవాదులు పాల్గొన్నారు.