28 March, 2026 | 11:45 PM

గౌడ సత్రం సేవలు రాష్ట్రానికి మార్గదర్శకం

28-03-2026 09:56 PM

* కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్

వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలో నిర్వహిస్తున్న గౌడ నిత్య అన్నదాన సత్రం సేవలు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. గౌడ కుల బాంధవులు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయంలో గౌడ సత్రం చైర్మన్ మహంకాళి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సినీ నటుడు డాక్టర్ సుమన్ సారథ్యంలో వేములవాడలో సత్రం ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు.

శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు నిత్యం అన్నదానం అందించడం గొప్ప సేవగా పేర్కొన్నారు. సత్రం భవిష్యత్తులో మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తూ తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మహంకాళి శ్రీనివాస్ గౌడ్ సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కోలగాని శ్రీనివాస్, చెన్నమనేని వికాస్ రావు, కాశి పీఠాధిపతి శ్రీమాన్, రేగుల మల్లికార్జున్, కోల కృష్ణస్వామి, దాది అశోక్, సురగొని రాజు, భైరవుని దేవయ్య, అబ్బగొని సురేష్, రావుల రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.