calender_icon.png 8 October, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతా పయనంలో..

07-10-2025 12:00:00 AM

ప్రముఖ నటుడు అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీతా పయనం’. ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్, నిరంజన్ లీడ్‌రోల్స్ పోషిస్తున్నారు. అర్జున్, ధ్రువ సర్జా శక్తిమంతమైన పాత్రల్లో కనిపించనున్నారు. సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సోమవారం ధ్రువ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ధ్రువ యాక్షన్ హల్క్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్; సాహిత్యం: చంద్రబోస్, కాసర్ల శ్యామ్; మాటలు: సాయిమాధవ్; డీవోపీ: జీ బాలమురుగన్; ఎడిటింగ్: అయూబ్‌ఖాన్; కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: అర్జున్ సర్జా.