07-10-2025 12:00:00 AM
నాగశౌర్య హీరోగా నటిస్తున్న పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేశ్) దర్శకత్వంలో శ్రీవైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. విధి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సముద్ర ఖని, నరేశ్ వీకే, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, చమక్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో నాగశౌర్య రగ్గడ్, ఇంటెన్స్ స్టైలిష్ అవతార్‌లో కనిపించాడు. ‘నువ్వు బ్యాడ్‌బాయ్ అని చెప్పారు.. కానీ స్మార్ట్ బాయ్‌లా ఉన్నావ్..’, ‘మీరొచ్చింది నాకోసమేమో అని తెలుసుకొని కొడదామనుకున్నా.. కాదని తెలిసిందిగా.. కొట్టి తెలుసుకుంటా..’ అంటూ సాగే డైలాగులు నాగశౌర్య మాస్ యాక్షన్ అవతార్‌ను ఆవిష్కరించేలా ఉన్నాయి.
ఈ చిత్రానికి సంగీతం: హారిస్ జైరాజ్; సాహిత్యం: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్; డీవోపీ: రసూల్ ఎల్లోర్; ఫైట్స్-: సుప్రీమ్ సుందర్, పృథ్వీ; ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు; ఆర్ట్: రామాంజనేయులు.