calender_icon.png 26 May, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెడ్ క్రాస్, బ్లడ్ బ్యాంక్ భవన ఏర్పాటుకు స్థల పరిశీలన

26-05-2025 12:42:39 AM

యాదాద్రి భువనగిరి మే 25 (విజయ క్రాంతి) :  యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్, బ్లడ్ బ్యాంక్ భవనాల నిర్మాణం  కోసం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదివారం నాడు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా కమిటీ  ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన నేపథ్యంలో వెంటనే స్థల పరిశీలన చేశారు. 

రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ చైర్మన్ డాక్టర్.గుర్రం లక్ష్మీనరసింహారెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థకు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో సొంత భవనాలు ఉన్నాయని. పలుచోట్ల బ్లడ్ బ్యాంకులు కూడా ఉన్నాయన్నారు. మన జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ కు కార్యాలయంతో పాటు బ్లడ్ బ్యాంక్  లేక అత్యవసర సమయంలో రక్తం బాధితులకు రక్తం అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

సకాలంలో రక్తం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని  తెలిపారు ప్రభుత్వం గనక స్థలం కేటాయించినట్టయితే రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కార్యాలయ భవనం,బ్లడ్ బ్యాంక్ భవన నిర్మాణం చేయడానికి  సిద్ధంగా ఉన్నామన్నారు. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు ప్రభుత్వం ద్వారా స్థలం  కేటాయించేందుకు కృషి చేయాలని  ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిని కోరారు.

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ. బ్లడ్ బ్యాంక్ జిల్లా ప్రజలకు చాలా అవసరమని త్వరలోనే అందరికీ అందుబా టులో ఉండే స్థలాన్ని చూసి బ్లడ్ బ్యాంక్ నిర్మాణానికి  స్థలం కేటాయించడానికి ప్రయత్నం చేస్తా నని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆవేస్ చిస్తీ,జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ,డివిజన్ కమిటీ చైర్మన్ సద్ది వెంకట్ రెడ్డి,రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.మహేందర్ రెడ్డి, జిల్లా కోశాధికారి డి.అంజయ్య,రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్.శేక్. హమీద్ పాశ, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,

భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కూర వెంకటేశ్,పక్కిర్ కొండల్ రెడ్డి,మహమ్మద్ ఇలియాస్, చల్ల గురుగుల రఘుబాబు,లయీక్ అహ్మద్, పట్టణ కమిటీ చైర్మన్ ఎల్లంకి పురుషోత్తం రెడ్డి, కె.చంద్ర శేఖర్, బి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.