26-05-2025 12:43:47 AM
సూర్యాపేట, మే 25 (విజయక్రాంతి) : సూర్యాపేట మండలంలోని యండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995- 96 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని త్రిబుల్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు.మూడు దశాబ్దల తర్వాత కలుసుకున్న నాటి విద్యార్థులంతా ఒకచోట చేరి వారి జ్ఞాపకాలను నెంబర్ వేసుకున్నారు.
తదుపరి నాటి ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు వెంకటరెడ్డి, సురేందర్, వెంకటేశ్వర్లు, సులోచన, విద్యార్థులు వి.వెంకటేశ్వర్లు, సంగు ఎల్లయ్య, నవీన్ రెడ్డి, సతీష్ రెడ్డి, సిహెచ్. కృష్ణ, పోరెండ్ల పద్మ, గౌసియా, కళ్యాణి, సంగూ సంధ్య తదితరులు పాల్గొన్నారు.