17 May, 2026 | 1:18 AM

బక్రీద్ వేళ అప్రమత్తం

17-05-2026 12:00 AM

పీస్ కమిటీ సమావేశంలో ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్

మేడిపల్లి, మే 16(విజయక్రాంతి): బక్రీద్ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు మెసులుకోవాలని, ఏ దైనా సమాచారం ఉంటే తమతో పంచుకోవాలని ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ అన్నారు. శనివారం మేడిపల్లిలోని ఎంకేబీఆ ర్ ఫంక్షన్ హాల్‌లో నాలుగు పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసు కోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి ఏసీపీ మోహన్ కుమార్, పోచా రం, ఘట్కేసర్, చర్లపల్లి సీఐ లు, ఎస్‌ఐలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.