08-12-2025 12:10:19 AM
-ఇన్‌స్టాలో స్మృతి మంధాన ప్రకటన
-ఇంతటితో ఈ విషయం వదిలేయాలని విజ్ఞప్తి
-తమ ప్రైవసీని గౌరవించాలన్న స్మృతి
ముంబై, డిసెంబర్ 7: అందరూ ఊహించినట్టుగానే భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రద్దయింది. పలాశ్ ముచ్చల్‌తో తన వివాహం రద్దయినట్టు స్మృతి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. పెళ్లి రద్దయినట్టు గత కొన్ని రోజులుగా వస్తు న్న వార్తలకు తెరదించుతూ ఆమె అధికారిక ప్రకటన చేసింది.
ఈ సమయంలో రెండు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరింది. గత కొన్ని రోజులుగా తన వ్యక్తిగత జీవితంపై ఎన్నో వదంతలు వచ్చాయని, వాటిపై స్పష్టత ఇస్తున్నట్టు తెలిపింది. తన పెళ్లి రద్దయిందని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని కోరింది. భారత్ తరపున మరిన్ని ట్రోఫీలు గెలవజమే తన లక్ష్యమని తెలిపింది.
ఇకపై తన దృష్టంతా క్రికెట్‌పైనే ఉంటుందని పేర్కొంది. తనకు మద్ధతు ఇచ్చిన వారందరికీ థ్యాంక్స్ చెప్పిన స్మృతి ఇక ముందుకు సాగాల్సిన టైమ్ వచ్చిందంటూ ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చిం ది. కాగా గత ఏడాదికాలంగా స్మృతి, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ ప్రేమలో ఉన్నారు.
ఇటీవలే వీరి తమ రిలేషన్‌ను ప్రకటించి పెళ్లి కూడా చేసుకోవాలను కున్నారు. నవంబర్ 23న వివాహం జరగాల్సి ఉండగా.. ముహూర్తానికి కొన్ని గంటల ముందు మం ధాన తండ్రి అనారోగ్యానికి గురవడం కలకలం రేపింది. తర్వాత పలాశ్ సైతం ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో పెళ్లి వాయిదా పడినట్టు ఇరు కుటుంబాలు ప్రకటించాయి.
గతం లో పలాశ్ ఒక అమ్మాయితో చేసిన వాట్సాప్ చాట్ లీక్ కావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగినట్టు, చివరికి స్మృతి పెళ్లి రద్దు చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. తర్వాత సోషల్ మీడియాలో సంగీత్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను స్మృతి తొలగించడంతో వార్తలు బలపడ్డాయి.
తాజా గా అసలు కారణం వెల్లడించని స్మృతి వివా హం రద్దయినట్టు తెలిపింది. ఇదిలా ఉంటే పెళ్లి రద్దవడంపై పలాశ్ కూడా ఇన్‌స్టాలో స్పందించాడు. ఇది చాలా బాధ కలిగించే విషయమని చెప్పాడు. అయితే తనపై అవాస్తవాలు ప్రచా రం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు. ఇదిలా ఉంటే తాజాగా పలాశ్‌ను ఇన్‌స్టాలో కూడా స్మృతి మంధాన అన్‌ఫాలో చేసింది.