18 April, 2026 | 10:21 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

23-05-2025 03:16 PM

అమరావతి: ప్రకాశం జిల్లాలో(Prakasam district) శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద ఒక లారీ కారును ఢీకొట్టడంతో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లాలోని స్టూవర్ట్‌పురం నివాసితులు అయిన బాధితులు మహానంది ఆలయాన్ని సందర్శించి ఇంటికి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కారులో ఉన్న మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘనటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.