calender_icon.png 23 May, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు

23-05-2025 01:48:51 PM

హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy)  హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. రజతోత్సవ సభలో రాజు, యువరాజు ఫొటోలు తప్ప ఎవరూ లేరని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ అభ్యర్థి లేక బీజేపీకి ఓట్లు వేశారని కోమటి రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట, సిరిసిల్లలో తక్కువ మెజార్టీతో గెలిచారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలు ఎవరూ ఆలోచించట్లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు.