20 August, 2026 | 6:15 PM

కోటగుళ్లను పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం

20-08-2026 05:42 PM

కోటగుళ్ల శిల్పాలు అద్భుతం     

 గణపురం, ఆగస్టు 20 (విజయ క్రాంతి): కోటగుళ్లను పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని గణపురంలోని కాకతీయుల కోటగుళ్లు గణపేశ్వరాలయం సముదాయం, శిల్పాలు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక డైరెక్టర్ (సంచాలకులు) రంజిత్ నాయక్ అన్నారు. గణపురం మండల కేంద్రంలోని గణపసముద్రం సరస్సు కట్టపై నిర్మిస్తున్న రిసార్ట్స్ కోటగుళ్ళకు రూ.3 కోట్లతో జరుగుతున్న కోటగుళ్ల అభివృద్ధి పనులను, పరిశీలించారు అనంతరం కాకతీయుల అపురూప శిల్పకళా వైభవశాల కోటగుళ్లను సందర్శించారు. ఆలయాల శిల్ప సంపదకు మంత్రముగ్ధులయ్యారు.

యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయ శిల్ప, వాస్తు నిర్మాణ రీతిలో గణపురం కోటగుళ్లు ఉన్నాయన్నారు. ఆలయాల శిల్పాలు మరువరాని మధురానుభూతిని కలిగించాయని ఆనందం వ్యక్తం చేశారు ఆలయాల పనుల్ని త్వరిత గతిన పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని  సంబంధిత అధికారులను రాష్ట్ర పర్యాటక సంచాలకులు రంజిత్ నాయక్ ఆదేశించారు. కోటగుళ్ల చరిత్రను సీనియర్ జర్నలిస్ట్ తాళ్లపల్లి యాదగిరి గౌడ్, గైడ్ తాళ్లపల్లి యుగంధర్ గౌడ్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటక శాఖ అధికారి శివాజీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యాటక శాఖ అధికారి చిర్ర రఘుగౌడ్, ఏ ఐ కీర్తి కుమార్, సైట్ ఇంజనీర్ శ్రావణ్ సెక్యూరిటీ గార్డ్ రాజు తదితరులు పాల్గొన్నారు.