23 July, 2026 | 1:52 AM

గిరిజన యువతకు నైపుణ్యాలే భవిష్యత్తు

23-07-2026 12:00 AM

ఎమ్మెల్యే జారే

ఐటీడీఏ ఆధ్వర్యంలో  శిక్షణ  కేంద్రం

అశ్వారావుపేట, జూలై 22 (విజయక్రాంతి): గిరిజన యువతను స్వయం ఉపాధి వైపు నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట గిరిజన భవన్లో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) భద్రాచలం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువజన శిక్షణ కేంద్రాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఐటీడీఏ ప్రా జెక్టు అధికారి రాహుల్ సంయుక్తంగా ప్రా రంభించారు.

గిరిజన ప్రాంతాల్లో నివసిస్తు న్న నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అం దించి, వారికి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆది నారాయణ మాట్లాడుతూ, నేటి కాలంలో కేవలం విద్య ఒక్కటే సరిపోదని, విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలు కూడా అత్యంత అ వసరమని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని అందిపుచ్చుకుని యువత స్వయం ఉ పాధి వైపు అడుగులు వేయాలని సూచించా రు.

ఈ కేంద్రంలో కంప్యూటర్ శిక్షణ, కుట్టు మిషన్ శిక్షణ, బ్యూటీషియన్ కోర్సులు, చేతివృత్తులపై ప్రత్యేక శిక్షణ, టెక్నికల్ స్కిల్స్, ఉపాధి ఆధారిత వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన వారికి ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికెట్లు అందజేయడంతో పాటు, ఆయా రంగాల్లో ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడు తూ, గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చే స్తోందని, వాటిలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అత్యంత ముఖ్యమైనవని అన్నారు. యువజన శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకుడికి శిక్షణ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ బాబు, ఆత్మ కమిటీ చైర్మన్ వీరభద్రరావు, జిల్లా సెక్రెటరీ లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.