‘నీట్’ లీకేజీకి ప్రధాని జవాబు చెప్పాలి
బీఎన్ రెడ్డి నగర్‌లో యూత్ కాంగ్రెస్ ఆందోళన
ఎల్బీనగర్, జూలై 22 : నీట్ పేపర్ లీకేజ్ కు ప్రధానమంత్రి బాధ్యత వహించి, ప్రజలకు జవాబు చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. లీకేజీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయ కులు, లోక్ సభ ప్రతిపక్ష నా యకుడు రాహుల్ గాంధీ అక్ర మ అరెస్టుకు నిరసనగా బుధవారం యూత్ కాంగ్రెస్ ఎల్బీ నగర్ నియోజకవర్గం అధ్యక్షుడు కే.శివకుమార్ ఆధ్వర్యం లో బీఎన్ రెడ్డి నగర్ చౌరస్తా లో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం నాయకులు మా ట్లాడుతూ... లక్షలాది మంది జీ వితాలతో చెలగాటమాడేలా ప్రశ్నాపత్రాల విషయంలో కేంద్రం నిర్లక్ష్యధోరణి ప్రదర్శించటమే కాకుండా... ప్రశ్నించిన వారిని అక్రమ అరెస్టులతో అణిచివేయాలని చూడటం దారుణమన్నారు. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి నేటి వరకు గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలను చేసిందన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుర్రం చరణ్ రెడ్డి, రామచంద్ర రెడ్డి, లీగల్ సెల్ చైర్మన్ నిఖిల్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.






