4 May, 2026 | 6:21 PM

హైదరాబాద్ మహావీర్‌లో ‘స్కోడా కైలాక్’ ఆవిష్కరణ

28-01-2025 01:28 AM

హైదరాబాద్( విజయక్రాంతి): స్కోడా ఇండియా తన నూతన ఆవిష్కరణ స్కోడా కైలాక్‌ను నగరంలో ఆవిష్కరించింది. సోమవారం జూబిలీ హిల్స్‌లో మహావీర్ స్కోడా షోరూమ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్కోడా ఇండియా బిజినెస్, బ్రాండ్ డెవలప్‌మెంట్ హెడ్ అనిల్ పెండ్సే సమక్షంలో ఈ కారును ఆవిష్కరించారు.

ఇప్పటికే సేఫ్టీ విషయంలో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన ఈ కారు ప్రయాణికులకు సౌకర్యంతో పాటుగా సురక్షిత ప్రయాణాన్ని అందించనుంది.  జూబిలీ హిల్స్‌లోని మహావీర్ షోరూమ్‌లో ఈ కారు సోమవార ంనుంచే అందుబాటులో ఉండనుంది.