25-05-2025 01:17:34 AM
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి):- స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని జూన్ 2 నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానంపై శనివారం అధికారులతో మంత్రి స మీక్షించారు. ఆస్తుల క్రయవిక్రయదారులకు పారదర్శకంగా, అవినీతి రహితంగా సమ యం ఆదా అయ్యేలా మెరుగైన సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా మొదటి దశలో ఏప్రిల్ 10న 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు గుర్తుచేశారు.
ఇవి మంచి ఫలితాలు రావడంతో ఈ నెల 12 నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేసినట్లు పేర్కొన్నారు. రెండు విడతల్లో కలిపి 47 చోట్ల అమలు చేసిన విధానం విజయవంతమైందన్నారు. రెండు విడతల్లో దాదాపు 36 వేల రిజిస్ట్రేషన్‌లు జరిగాయన్నారు. అందుకే మిగిలిన 97 చోట్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభిస్తున్నామని, ఇందుకు అ వసరమైన ఏర్పా ట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రి య కూడా సులభతరమవుతుందని, ఉద యం 10.30 నుంచి 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయం త్రం 5 గంటల వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ప్రజల సమయా న్ని ఆదా చేసేందుకు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చే సేందు కు సంస్కరణలకు స్వీకారం చుట్టామన్నారు.
నిషేధిత ఆస్తుల వివరాలకు పోర్టల్..
స్లాట్ బుకింగ్ విధానం దృష్ట్యా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్ధీకరణ చేస్తున్నామని, పని భారం అధికంగా ఉన్న పఠాన్‌చెరువు, యాదగిరి గుట్ట, గండిపేట, ఇబ్రహీం పట్నం, సూర్యాపేట, జడ్చర్ల, మ హబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్ మొత్తం తొమ్మిది చోట్ల అదనపు సబ్ రిజిస్ట్రార్‌తోపాటు సిబ్బందిని నియమిస్తున్నట్టు తెలిపా రు.
నిషేధిత జాబితాలోని ఆస్తులను ఎట్టి పరిస్దితుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయకుండా పకడ్బందీగా చర్య లు తీసుకుంటున్నామన్నారు. భూ భారతి తరహాలో ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను ఏర్పా టు చేశామని, నిషేధిత ఆస్తుల వివరాలను దీనిలో పొందుపరచడం జరుగుతుందని తెలిపారు.
పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు..
ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించడానికి ఆదివారం రాష్ర్టంలోని 33 జిల్లా కేంద్రాల్లో జేఎన్టీయూ ఆధ్వర్యంలో రాత పరీక్ష నిర్వహిస్తున్నామని, ఈ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.
పరీక్షకు దాదాపు 5వేల మందికి పైగా హాజరయ్యే అవకశాముందన్నారు. గత ప్రభుత్వం వీఆర్‌వో, విఆర్‌ఎ వ్యవస్దను రద్దుచేసి గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసిందని విమర్శించారు. వీలైనంత త్వరగా వీరి సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు.