స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
తంగళ్లపల్లి, అక్టోబర్ 6 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని సారంపల్లి గ్రామపంచాయతీ(Sarampalli Gram Panchayat) ఆవరణలో సర్పంచ్ గుగ్గిళ్ల లావణ్య–నర్సయ్య, మల్లాపూర్ సర్పంచ్ లావణ్య–రమణరావు, బస్వాపూర్ సర్పంచ్ పూర్మాని రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులను(Smart Ration Cards) పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మునిగేల రాజుతో కలిసి లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.
కార్యక్రమంలో AMC డైరెక్టర్ పొన్నాల పర్శరం, కాంగ్రెస్ నాయకులు గుగ్గిళ్ల భరత్ గౌడ్, ఎడ్ల తిరుపతి, గ్రామ అధ్యక్షులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, రేషన్ షాప్ నిర్వాహకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.