కౌమార దశ బాలికలకు 'స్నేహ గ్రూప్' అవగాహన సదస్సు
28-04-2026 03:05 PM
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 'స్నేహ గ్రూప్' యుక్త వయస్సు బాలికల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కౌమార దశలో బాలికలు ఎదుర్కొనే సవాళ్లు, చట్టపరమైన రక్షణలు, ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించారు.
బాలికలు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. సమాజంలో ఇంకా వేళ్ళూనుకుపోయి ఉన్న బాల్య వివాహాల దురాచారం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.






